Dongri To Dubai

nallajabilli dawood details

డోంగ్రి నుండి దూబాయి  అనేది 6 దశాబ్దాల ముంబై మాఫియా కు సంబందించిన కథ 

అధికారాన్ని శాశించేది తుపాకీ బారెల్ మాత్రమే.

అదే విషయాన్నీ Dawood Hassan Ibrahim Kaskar ను అడగగా అతను నేను దీనిని చెప్పట్లేదు ప్రత్యక్ష సాక్షాన్నిస్తున్న అంటాడు 

D-COMPANY / డి -కంపెనీ 


ముంబై భారత్ లో మాఫియా ను ఎగుమతి చేసే ఒక పెద్ద స్థావరం. దాని అధినేత Dawood Hassan Ibrahim Kaskar ఇప్పుడు అతను ఈ ప్రపంచంలో Most Wanted Man In the plannet.
Dawood Hassan Ibrahim Kaskarఇప్పుడు పాకిస్తాన్ లో రహస్యంగా తలదాచుకుంటున్నాడు. Dawood D company నాయకుడు D  company అసాంఘిక కార్యకలాపాలకు పేరుగాంచింది.
2004 లో US ట్రెజరీ డిపార్ట్మెంట్   తెలిపిన వివరాల ప్రకారంగా ప్రపంచ యొక్క తీవ్రవాద కవచం గా  D Company పిలవబడింది, ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాల లావాదేవీలలో ఏ విధమైన మచ్చలు లేవు.  Dawood   సేవకులు అతని వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి చాల నమ్మకంగా పనిచేసేవారు
dawood white house
ఆ సేవకుల లెక్కల ప్రకారంగా దాదాపుగా US లో ఉండే జాబితా అమెరికా అధ్యక్షుడి కి మద్దతుగా వచ్చేవారి సంఖ్య కన్నా ఎక్కువగా ఉంటుందని వారి బలమైన నమ్మకం. అందుకే దావూద్ తన విల్లా అన్నిటి పైన ది వైట్ హౌస్ అని  రాసి ఉండేదని చెప్తున్నారు.. భారత్ లో ఒకటి , దుబాయిలో ఒకటి (1994) , ఆతర్వాత అతని నివాసం కరాచిలోకి మారింది అక్కడ కూడా అతను తన ఇంటి పేరును ది వైట్ హౌస్ గానే మార్చడు .ఆ తర్వాత నిర్మించిన లండన్ లో విల్లా అచుగుద్దినట్లు ఒరిజినల్ వైట్ హౌస్ లాగానే ఉంటుంది దావూద్ తన డీల్ లను వేరు వేరు దేశాలతో వేరు వేరు సమయాలలో నడిపేవాడు.
వాటితో జరిగిన ఒప్పందాలను ఎప్పటికప్పుడు దాటుతూనే ఉండేవాడు. ఈ డేట్ విషయాలు ఎక్కువగా నల్లధనం మార్చడం, మరియు పెట్రోల్ ఉత్పతుల మీద జరిగేది.
1993 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు మరియు 700 మంది క్షతగాత్రులయ్యారు. అదేవిధంగా ముంబై 26/11 లో కూడా దావూద్ హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది   దీనికి ప్రధాన నిందితునిగా దావుద్ ను ఇండియా కూడా వెతుకుతుంది.

1986,87 లో భారతీయ తీరాలను విడిచిపెట్టిన సంవత్సరాలలో, ముఠానాయకులు అతని తిరిగి రావడానికి అనేక ప్రయత్నాలు చేశారు
ఇండియా ఆర్థికవ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకున్నాడు దావూద్ తానూ పాడిందే పాటగా (బాలీవుడ్ సినిమాలకు పాటలు రాసేవాడు ) , ఆడిందే ఆటగా నడిచేది ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ మరియు భారత క్రికెట్  రెండూకూడా దావూద్ ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ చెప్పిన విధంగా నడిచేది

1993 మర్చి ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ తన పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసుకున్నాడు, భారత్ పైన దాడి కోసం దావూద్ ను ఉపగించుకోవాలన్న పాకిస్తాన్ కు దావూద్ డాన్ లాగా మారిపోయాడు ఒక్క పాకిస్తాన్ కె కాదు ప్రపంచ డ్రగ్ స్మగ్లింగ్ , రియల్ ఎస్టేట్ , గోల్డ్ ,సిల్వర్ మరియు ఎలక్ట్రానిక్ ఎగుమతి దిగుమతులు, క్రికెట్  దావూద్ D కంపెనీ కనుసన్నలోనె జరిగేవి ఒక  రకంగా చెప్పాలంటే దావూద్ భారత్ ,పాకిస్తాన్లకు బాగా కావలిసిన మనిషి ఒకరికి మిత్రునిలా ఒకరికి శత్రువుగా ... మొత్తానికి ప్రపంచానికి దావూద్ ఒక డాన్  గా నిలబడ్డాడు .
ఈ ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ ను పాకిస్తానుకు మరింత దగ్గర చేర్చింది, ఒక కొత్త పేరు , సరికొత్త గుర్తింపు ,కొత్త పాస్పోర్ట్ ,కొత్త జీవితాన్ని ఇచ్చింది, పావుగా వాడుకుందామనే దేశాన్ని శాశించే స్థాయికి చేర్చింది. ఎంత పేరున్న కూడా దావూద్ తనను తానూ ఒక ముంబై వాసిగానే చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు ముంబై అంటే దావూద్ కు ఎదో తెలియని ఇష్టం, ఆ కారణం చేతనే రాజకీయ మిత్రులతో భారత్ రావటానికి చాల ప్రయత్నాలు చేసేవాడు ఇప్పటికి చేస్తున్నాడని సమాచారం.

దావూద్ ప్రయాణం ముంబై సముద్ర తీరం చివరన మొదలయ్యి భారత్ కు చిరకాల ప్రత్యర్థి అయినా పాకిస్తాన్ వరకు సాగింది... 

గత 40 సం. లలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాకిస్తాన్ భారత్ ల మధ్య సంబంధాలను ప్రభావితం చేయగలిగారు ఒకరు దావూద్ ఇంకొకరు పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హాక్ , జియా ఉల్ హాక్ ద్వారా కాశ్మీర్ లోకి ఇస్లాం ప్రవేశించింది, ఇస్లాం సూఫీ ఇస్లాంగా , సూఫీ ఇస్లాం కాశ్మీరీ సూఫీలుగా కాశ్మీర్ ట మార్చబడ్డారు. దావూద్ మాత్రమే రెండు దేశాలకు వారధిగా రెండు దేశాల మధ్య తీరని బంధంగా మిగిలిపోయాడు.
భారత ప్రభుత్వం దావూద్ ను అప్పగించమనాడం పాకిస్తాన్ నిరాకరించడం పరిస్థితి ఒక జోక్ లాగా మిగిలిపోయింది ఈ గొడవ జరిగితున్నంత కాలం దావూద్ పేకాట ఆడేవాడట కానీ రెండుదేశాల మధ్య శాంతి నిలపాలన్న కోల్పోవాలన్న దావూద్ కే మాత్రమే సాధ్యమన్న విషయం దావుడ్తో పటు రెండు దేశాలకు తెలిసి పోయింది

దావూద్ కరాచీలోని క్లిఫ్టన్   నగరం లో ఒక వైట్ హౌస్ నిర్మించి అందులోనే ఉండేవాడు. 
  Clifton lo Dawood Villa

దావూద్ కుటుంబం :


దావూద్ కు ముగ్గురు ఆడపిల్లల(మహారూఖ్ , మెహ్రీన్,  మజియా ) తర్వాత ఒక కొడుకు పుట్టాడు (మొయిన్ ) మొయిన్ కోసం దావూద్ వైట్ హౌస్ పక్కనే ఒక విశాలమైన వీళ్ళను నిర్మించాడు , దాని చుట్టూ కొన్ని వందలమంది కరాచీ రేంజర్స్ రాత్రి పగలు కాపలా కాచేవారు, పాకిస్తాన్ ప్రధాని కంటే కూడా ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉండేది. ఆ భవనం విలువైన రాళ్లతో ఎప్పడు ఎలిగి పోతుండేది. ఒక పెద్ద నీటి ఫౌంటెన్ , Temparature balancing Swimming pool , tennis court, billiard court  jogging track, మరియు మొయిన్ కు దగ్గరి వారుండడానికి ఒక స్పెషల్ సెక్యూరిటీ హాల్ తక్కువ ప్రాముఖ్యం ఉన్నవాళ్లకు ఒక గెస్ట్ హౌస్ ఉండేది.


దావూద్ జీవితం :

దావూద్ పెట్టుకునే కళ్ళజోడు 
నిజానికి దావూద్ జీవితం ఒక రోజులగా బ్రతకాడు అనడానికి ఏమాత్రం అతిశోయక్తి కాదు. ఆటను ధరించే దుస్తువులు సుప్ట్స్ కేవలం లండన్ నుండి వచ్చేవి , పేటెక్ ఫిలిప్ చేతి గడియారం మరియు కొన్నిసార్లు కార్టియర్ వజ్రం పదును పెట్టినవి అన్ని లక్షల విలువైనవి కాల్చడానికి treasurer cigarettes, Maserati sunglasses, Bally sport shoes , సంతకం పెట్టడానికి వజ్రాలు పొదిగిన పెన్ను ఆ పెన్ను ఖరీదు 5లక్షలు ఉంటుంది, దావూద్ కు చాలా కార్లు ఉన్నాయి కానీ బ్లాక్ కలర్ బాంబు ప్రూఫ్ మెర్సిడిస్ ను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఎప్పుడైనా బయటకొచ్చినపుడు సెక్యూరిటీ చుస్తే పాకిస్తాన్ ప్రధాని చిన్నబోయేవాడు
దావూద్ తాగే సిగరెట్ 

ఎంత డబ్బున్న కూడా ప్రపంచంలోని ఏ సంపద మీకు మంచి రాత్రి నిద్రను హామీ ఇవ్వదు.
దావూద్ ఎప్పుడు నిద్రలేమితో బాధపడుతుండే వాడు దానిని తప్పించుకోవడం కోసం తనకు తాను డ్రగ్స్ ను ఉపగోయించుకునే వాడు పగటి సమయాల్లో డ్రగ్స్ తో నిద్రపోయి సాయంత్రం వేళల్లో రాత్రి ఎక్కువగా పనిచేసేవాడు తన కోసం వ్యాపార లావాదేవీలకు వచ్చే వాళ్ళను సాయంత్రం వరకు ఒక ప్రత్యేక గదిలో వేచిఉండమనేవాడు ఆ గదిలో అన్ని ఉండేవి మందు చిందు అమ్మాయిలు , డ్రగ్స్ హీరోయిన్లు మోడల్స్ అన్ని లభించేవి , ఈ నిరీక్షణకు పెద్ద పెద్ద రాజకీయ నేతలకు పాక్ ప్రధాని అయినా కూడా వేచి ఉండవలసిందే. ఆ మీటింగ్ కు వచ్చిన వారు ఒకరినొకరు పలకరించుకోవద్దు , కనీసం మాట్లాడుకోవద్దు డాన్ తో మీటింగ్స్ కొన్ని జీవితాలను మార్చేవిగా ఉంటాయి మరి ఇందులో ఎక్కువగా పాకిస్తాన్ కు చెందిన ముఖ్యమంత్రులు ఉండేవారు.

దావూద్ పాకిస్తాన్ లోని ముఖ్య నగరాలలో చాల విలువైన ఆస్తులను కలిగి ఉన్నాడు ముఖ్యంగా కరాచీలోని Khayabane Samsheer , Shah Rahe Faisal , మరియు లాహోర్ లోని మాదిన మార్కెట్లలో Peshawar దగ్గర్లో Orkazai మొదలైనవి పాకిస్తాన్ దావూద్ ను ఉత్సహ పర్చడానికి సినీతారలు ఎప్పుడు ముందుండేవారు. పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ ఇండియాలో షాట్లు పేల్చగలడు. కొన్ని సంవత్సరాలవరకు ఇండియాలోని బాలీవుడ్ సినిమాలు మొదలుకొని గుటక వరకు దావూద్ మధ్యవర్తిత్వం తప్పకుండ ఉండాల్సిందే. చాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ నుండి ఎయిర్లైన్స్ వరకు ప్రతిదీ దావూద్ D-Company చూసుకునేది,ఇప్పటికి కొన్ని ఎస్టేట్ ప్రాజెక్టులలో దావూద్ పాకిస్తాన్ నుండి రిమోట్ ఆపరేటింగ్ చేస్తుంటాడు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు , పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది ఇప్పటికి డాన్ తో సంబంధాలు లావాదేవీలు నడిపిస్తుంటారు . చాల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఉద్యోగాలు దావూద్ తో సంబంధాలున్నాయన్న కారణం తోనే కోల్పోయారు.

దావూద్ ఇబ్రహీం : దావూద్ 5 అడుగుల 11 అంగుళాలు ఎత్తు ఉంటాడు . దావూద్ చూసే చూపు సముద్ర గర్భం లోని సుడిగుండంలా సూటిగా ఉంటుంది దావూద్ ను ఈ చూపే , తక్కువగా మాట్లాడే విధానం అంత బలవంతుణ్ణి చేసిందేమో ?. దావూద్ 1955 డిసెంబర్ 26 తేదీన పుట్టాడు ఇప్పుడు దావూద్ వయసు 64 సంవత్సరాలు 64 సం వయసున్న దావూద్ వత్తైన పెద్ద జుట్టు క్లీన్ షేవింగ్తో భయపెట్టే మీసాలతో ఉంటాడు. దావూద్ కు మీసాలపైనా చాల విశ్వసం తానూ ఈ మీసాలతోనే అదృష్టం వుందంటాడు మరియు మీసాలతోనే ప్రజల్లో నన్ను గుర్తుపెట్టుకోవాలంటాడు . ముంబైలో దావూద్ ను "ముచ్ఛద్ " అండర్ వరల్డ్ డోన్ అనే పేరు కూడా ఉంది. దావూద్ శారీరకంగా చాల దృడంగా ఉంటాడు.
 బాస్ పాకిస్తాన్ లోకెల్లా మొదటివాడు 2000 సంవత్సరంలో పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకు ప్రకటించిన లెక్కల ప్రకారంగా దావూద్ కథలో 200 కోట్ల రూపాయలు ఉన్నాయ్. దావూద్ వ్యాపారం చాల పెద్దది వ్యాపారంలో ఇండియా , పాకిస్తాన్ తో పాటు నేపాల్ , భూటాన్ థాయిలాండ్ , సౌత్ ఆఫ్రికా ,ఇండోనేషియా ,మలేషియా , యునైటెడ్ కింగ్డమ్ ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ,సింగపూర్ , శ్రీలంక ,జర్మనీ ,మరియు ఫ్రాన్స్ ఇంకా కొన్ని దేశాలతో డ్రగ్స్ సప్లై చేయించేవాడు కొన్ని ఫ్రాంచేజి లున్నాయి కొన్ని గ్యాంబ్లింగ్ డేన్స్ బాస్ నడిపే వ్యాపారాలు.
Image result for dawood with javed miandad
దావూద్ &జావేద్ మియాందాద్ 
కరాచీలో దావూద్ మకుటం లేని మహారాజు ఇక్కడ గన్ స్ముగ్లింగ్, స్టాక్ మార్కెట్ ,రియల్ ఎస్టేట్ మరియు "hundi " హవాలా సిస్టం. దావూద్ ఎక్కువ డబ్బును "sehgal గ్రూప్ " లో పెట్టుబడిగా పెట్టేవాడు, దావూద్ కు అత్యంత సన్నిహితుడు జావేద్ మియాందాద్  
సెహగల్ బ్రదర్స్ కి అల్లుడుకూడా దావూద్ కూతురిని(మాహరుక్ ) జావేద్ మియాందాద్ కొడుకు (జునైద్ ) వివాహం చేసుకున్నాడు
దావూద్ మారు పేర్లు : దావూద్ కు మొత్తం 13 మరు పేర్లున్నాయి అందులో పాకిస్తాన్ లో ఉన్న పేరు మాత్రం షేక్ దావూద్ హస్సన్ , ఈ పేరు మీదనే ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది , కొంత మంది డేవిడ్ అని భాయ్ అని ముంబై ,ఢిల్లీ లోని తన మిత్రులకు ఫోన్ చేసినప్పుడు మాత్రం హాజీ సహాబ్ , అమిర్ సహాబ్ అని చెబుతుంటాడు.
D - company ముంబైలోనే ఎక్కువ బిజినెస్ చేసేది ఇక్కడ ఉన్న బాలీవుడ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ కొన్ని వందల కోట్ల డాలర్ల డబ్బు హవాలా చెయ్యబడేది అది ఏవిదంగా అంటే వెస్ట్రన్ యూనియన్ మార్చే డబ్బుకన్నా కొన్ని వందల రేట్లు ఎక్కువగా దావూద్ హవాలా చేయించేవాడు . దావూద్ 21శతాబ్దపు కొత్త వ్యాపారవేత్త, పోటీదారులతో తీవ్రంగా బాగస్వామ్యులతో నిజాయితీగా ఉండేవాడు , దావూద్ కు తన మిత్రులను,company ని , మాఫియా ను, పాకిస్తాన్ లో ఉన్న isi నెటవర్క్లను ఏవిదంగా వాడుకోవాలో తెలిసిన నేర్పరి.
దావూద్ అన్ని రకాల మెళుకువలు తెలిసిన ఒక తెలివైన వింత జింక
అన్ని తెలిసిన దావూద్ పాకిస్తాన్ చేతిలో మాత్రం ఒక పావులుగా ఉపయోగిన్చబడుతున్నాడు. పాకిస్తాన్ చేతిలో ఉంది అనేక దేశాలను  అమెరికాతో కలిపి తనచేతులతో ఆడించగల సమర్థుడు. 

బహుశా దావూద్ ఇబ్రహీం వదిలివేయబడ్డ ప్రశ్నగానో , అసంపూర్తిగా ఆపివేసిన పద్యం లాగానో ప్రాణమున్న అస్థిపంజరంలాగానో , దావూద్ ప్రభావంలో మూతిమీద మీసం , పెదవులపైనా సిగరెట్, చేతిలో మందుగ్లాసుగానో సినిమాల్లోనో , పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చగానో నిలిచి పోతాడు ఇండియాలో పాకిస్తాన్లో ఎదో ఒక రూపంలో దావూద్ ముద్ర కచ్చితంగా కనిపిస్తుంది.

Post a Comment

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget