మహాకవి శ్రీ శ్రీ బాదలోంచి కవిత్వం పుడుతుందని అన్నారు.
ఇక్కడ రాసినవన్నీ బాధలోంచి కాకా పోయిన
బాధకలిగినప్పుడల్లా రాసిందనుకుంటే,
కొన్ని ఆవేశంతో, కొన్ని ఆలోచనలతో రాసినవి ,
ప్రశ్నల కొలిమిలో జవాబులు వెతికాడంలో భాగంగా కొన్ని,
బాధతో కొన్ని గురువులు బోధించిన విషయాలు కొన్ని గుండెకోతతో కొన్ని,
గురిపెట్టినవి కొన్ని,
గుడ్డిగా విడిచినవి కొన్ని ఉన్నాయ్.
ఈతరం లో నేను,
నా కుటుంబమని గిరిగీసుకుంటే
పబ్బుల్లో, క్లబ్బుల్లో, బైక్ రైడింగ్,
ఇంటర్నెట్ చాటింగ్ లో మునిగితే
నా మార్గం బిన్నామంటూ,
నేను ఏకాకిని కానంటూ కవితల్లో కాలాన్ని గడుపుతూ ...
ఈ నా కవితలు చదివి ఎవరు కన్నీళ్లు కార్చారండి ,
చివరగా ...
మీ కంటే ముందు ఉద్యమాల్లో సమిధలయ్యారు
మీ తరువాత వారు ప్రమిదలవుతారు
మీకు కావాల్సింది మీ బతుకులు మీరు బతకడం.
సావర్కర్ బోనగిరి.
Post a Comment