why/when mistakes happen?
why/when mistakes happen?
తన ఉద్దేశ్యం అవతల వారికి సరిగా అర్ధం కానప్పుడు
"నీ భార్యని నగ్నంగా వేరే వ్యక్తితో చూస్తే సంతోషించు, ఆనందం తో ఎగిరి గంతులు వెయ్యి."
దుక్కిస్తే నీకె నిద్ర ఉండదు, కోపిస్తే నీకె అనారోగ్యము , ఆమెను కొట్టిన నీకె జైలు శిక్ష. కాబట్టి నీకు రెండే దార్లు ఉన్నాయి. జరిగినదంతా మర్చిపోయి మరింత సుఖంగా, తన ప్రియుడితో ఆమె అనుభవాలు ఆమె ద్వారా వింటూ ఆమెతో సంసారం చెయ్యడం!. అది కష్టమయితే నీ స్థానంలో ఆమెకు ఎప్పుడు తన ప్రియుడు గుర్తొస్తున్నాడంటే విడాకులు ఇవ్వడం!. ఇక సంతోషం ఎందుకంటావా!? నీ పడగ్గదిని, ఫ్యాన్ ని, కరెంట్ ని వాళ్ళు మరింత కాలం వాడుకోకుండా ఈ రహస్యం ఇంత తొందరగా నీకు తెలిసినందుకు! అందుకు ఆనందంతో గంతులు వెయ్యి. అంతే తప్ప దాని గురించి రాత్రులు నిద్రలేకుండా కుమిలిపోకు. ఆమెని క్షమించి సంసారం చెయ్యి లేదా భవబంధాలు తెంచుకో ! విచారించి ఏమిలాభం లేదు". ఇది అతడి ఉద్దేశ్యం. ఎంత కరెక్ట్ గా ఉన్నదో చుడండి. కుమిలిపోవడం వలన గానీ, కోపం వలనగానీ పరిష్కారం లభించదు. చాలా మంచి సూచన. కానీ అతడి ఉద్దేశం అవతలి వారికీ అర్ధం కాలేదు... కొట్టారు.
తన ఉద్దేశ్యం తనకి అర్ధంకానప్పుడు
ఒక అబ్బాయి తల్లిదండ్రులు "బయో-ఇంజనీరింగ్" లో చేర్పిద్దామని నిశ్చయించుకున్నారు.
నేను బహుశా జెనెటిక్ ఇంజనీరింగ్ అయి ఉంటుంది.
ఏ యూనివర్సిటీ ?
మద్రాసు దగ్గిర ఎక్కడో ఉన్నదన్నారు !
ఎక్కడోనా ? అంటే మీకు తెలీదా ...
సరిగ్గా తెలీదు.
నేను మీ అబ్బాయికి సైన్స్ ఇంటరెస్ట్ ? లెక్కలా ?
లెక్కలే. అందుకే ఇంజనీరింగ్ లో చేర్పిస్తున్నాను .
నాకు సరిగ్గా అర్ధం కాలేదు,
ఇంజినీరింగ్ వేరు, జెనెటిక్ ఇంజనీరింగ్ వేరు కదా ?
మొదటి దానికి సైన్స్ చదవాలని చెప్పా.
జెనిటిక్ ఇంజనీరింగ్ అంటే లెక్కలు కాదా ? కాదు,
అది జీన్స్ కి సంబందించిన శాస్రం.
అయితే బయో- ఇంజనీరింగ్ ఏమో ? పోనీ సరిగ్గా దానిగురించి అయినా సరిగ్గా కనుక్కున్నారు లేదు,
మీరు చెప్పిన తర్వాత నాకంత కన్ఫ్యూషన్ గా ఉంది అన్నాడు ఆ అబ్బాయి.
తన ఉద్దేశం తనకి సరిగ్గా అర్ధం కాకపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది
ఒక విషయం వాస్తవమని ఒక్కోసారి గాఢంగా మనిషి నమ్ముతాడు.
తాను భ్రమ లో ఉన్నానని తెలుసుకోలేనివాడు మూర్కుడు
తెలుసుకున్నవాడు మధ్యముడు
తెలుసుకుని మారిన వాడు జ్ఞాని
తెలుసుకున్న మారని వాడు ఆధముడు.
అవతలి వారి ఉద్దేశ్యం తనకి సరీగ్గా అర్ధం కానప్పుడు తనకే ఉద్దేశ్యము లేదు. కానీ అవతలి వాళ్లకు ఉంది. అది తనకి తెలీదు
ఉదాహరణకి కమల, రాజు కొన్నాళ్ళు స్నేహంగా ఉన్నారు అనుకుందాం.
కమలకి గర్భం వచ్చింది . పెళ్లి చేసుకోమ్మంది. రాజు నిజాయితీగా ఆశ్చర్యపోయాడు.
అతడికి ఆ ఉద్దేశ్యం లేదు. ఆమె తరపున ఉన్న బంధువులు " ఆ ఉద్దేశం లేకుండానే అనుభవించావా ? " అన్నారు. దానికి అతను ఆమెకు పెళ్లి ఉద్దేశ్యం ఉందని తెలిస్తే అప్పుడే ఆలోచించే వాణ్ణి ఆమెకూడా నాతో ఎంజాయ్ చేస్తుందని నేను అనుకున్నాను. అన్నాడు.
వాళ్ళు కోర్టుకెళ్లారు. కేసు కొట్టివేయబడింది. ఆమెకు 18 ఏళ్ళు నిండాయి కాబట్టి స్వంతగా ఆమె ఎవరితో ఉండాలో ఆలోచించుకునే విజ్ఞత వుంది. కాబట్టి అతడి లైంగిక చర్య శిక్షార్హం కాదని కోర్టు కొట్టివేసింది. Breach of Promise తప్పు. కానీ ఆ వాగ్దానం చెయ్యనంత కాలం, ఆ వాగ్దానం రుజువు కానంత కాలం తప్పులేదు. ప్రేమికులు తమ ప్రేమ ఎటు వెళ్తోంది ? పెళ్ళికా సెక్స్ ఆనందానికా?
తెల్సుకోవాలి.
ఒక వేళా పెళ్లికైతే పెళ్లి చేసుకొని రహస్యంగా ఫోటోలు తీసుకోని దగ్గర పెట్టుకోవాలి. పెళ్లి వాయిదా పడుతుంటే ముగ్గురు సాక్షులు అవసరం కాబట్టి వాయిదాకు కారణాలు తెల్సుకొని పెళ్లి ఫోటోలను రుజువు కింద దాచుకోవచ్చు. చాల మంది ఆలా చెయ్యరు.
తమ పెళ్లిని ఏ శక్తి ఆపలేదనుకుంటారు ... కానీ ఆలా ఆపటానికి పెద్ద శక్తి అవసరం లేదు.
ఇద్దరిలో ఒకరికి ఇంటరెస్ట్ తగ్గితే చాలు.
పరిస్థితులు మారినప్పుడు
భారత్ లోని ఒక వ్యాపారికి పాకిస్తాన్ నుండి ఒక కోటి రూపాయల ఆర్డర్ వచ్చింది. సరుకు వ్యాపారి కూడా డెలివరీ చేసాడు. పాకిస్తాన్ కూడా నిజాయితీగా డబ్బును ఇచ్చేద్దాం అనుకుంది.
ఇంతలో యుద్ధం వచ్చింది. అన్ని లావాదేవీలను రెండు ప్రభుత్వాలు నిలిపివేశాయి.
ఇద్దరు సిన్సియర్ గా ప్రేమించుకున్నారు అతడి తండ్రి ఆకస్మికంగా చనిపోయాడు. వ్యాపారం అప్పుల్లో ఉంది. చెల్లెళ్ళ పెళ్లి చేయాలి. కట్నం కోసం మరొకర్ని పెళ్లిచేసుకున్నాడు తనని మర్చిపొమ్మని చెప్పి. అతని దృష్టిలో అది త్యాగం, ఆమె దృష్టిలో అది మోసం.
ఇద్దరి ఉద్దేశ్యాలు ఒకరికొకరి అర్ధం కానప్పుడు ఇద్దరు చెరొక ఉద్దేశ్యం తో పని ప్రారంభిస్తారు అవతలి వారికీ ఇది తెలియనివ్వరు.
హైదరాబాద్లో ఒక సంఘటన : అమ్మాయి అందమైనది. తెలివైనది. చదువుకున్నది. అతడు ఒక బిజీషాట్ కొడుకు. అతడితో స్నేహం చేసింది, కాస్ట్లీ Hotels, గిఫ్టులు ! అతనితో స్నేహం లేకపోతె అవన్నీ ఉండవు . అటువంటి hotels లో కాలుమోపలేదు ఆమెకి తెల్సు.
అతను అంత అందంగా ఉండడు కాబట్టి అతనికి ఆమెను వదిలే ఛాన్స్ లేదు, గట్టిగా అడిగితె ఆమె అతన్ని విడిచిపోతుంది . అతడు వ్యాపారస్థుని కొడుకు కాబట్టి అన్నిటికి పెట్టుబడి పెట్టడం అలవాటు అందుకే అన్ని గిఫ్టులు, పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ చూపించక ఆమె అతనికి మరింతగా దగ్గరవ్వాలి.
శారీరకంగా అతను ఆమెను అనుభవించాలి. ఆమెకు కూడా తెల్సు ఒకసారి తనను తానూ అర్పించుకుంటే అతనికి ఇంట్రస్ట్ పోతుందని అతను ఆమెను వదిలేస్తాడను అందుకే అంత తొందరగా ఒప్పుకోదు. అంత జరిగాక ఇద్దరు విడిపోతారు అశ్యరంగా ఎవ్వరు బాధపడరు