వాడు!
మనలని ఏలుతున్నంతసేపు
ఎడ్డోనోలే, గుడ్డోనోలే
ఊకనే ఉందాం!.
వాడు కొత్త ఆలోచనలతో దోచుకోవడం,
దోచుకుంది దాచుకునేవాడంలో
నేర్పరి!
ఇస్త్రీ నలగ లేదు, ఇవతలకొచ్చి
రోడ్డుమీద కూసున్నది లేదు
ఇంక రక్తం సింధువులెక్కడవి?!
అసువులుబాసిన అమరవీరుల
ఆర్తనాదాలు...
వానికి అపహాస్య వేణునాదమైంది
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ సాగరంలో
మునిగిపోతున్నాం కదా?!
పుస్తక పఠన పురుగులన్నీ
ఆల్కహాల్ తో పిచికారీ కాబడ్డాయి
ఇక సమాజమనే గ్రంధాన్ని
ఎవడు పట్టుకుంటాడు
పేద మధ్య తరగతి బంధావ్యాలు
దూరం చేయాలనే ప్లాన్లో వాడు...!
నిష్ణాతుడు???
నిండు పున్నమిని అమావాస్య వెలుతారంటాడు!
నిండు అమాసను పున్నమి అనమంటాడు.