February 2019


ఓ జవాన్... మా దేశరక్షకుడా
నీ త్యాగమే సమసమాజ నిర్మాణమయ్యా
 స్మార్ట్ ఫోన్ తో స్వర్గ విహారాలు చేస్తున్న
బికులపైనా రయ్యిమంటూ దూసుకుపోతున్న
ఉహాకాదు బతుకంటే పోరాటం వాస్తవమని
ఈ  లోకానికి మరోదారి చూపినావు...

imagination-nallajabilli

అన్నీ అందరు సాదించారనుటకన్నా,
ఇవి ప్రయత్నించి చూడరా చిన్నా...
నువ్వే చేసే ప్రయత్నంలో
అంతులేని ఆకాశానికి అంచుని కనిపెట్టవచ్చునేమో?
సముద్రపునీటిని అమృతంలా తాగవచ్చునేమో?
భూమి నే ని చుట్టూ తిప్పవచ్చునేమో?
 చాపల మడిచి ఒక మూలాన పెట్టవచ్చునేమో ?
సూర్యునిపైన తేనీరు మరిగించవచ్చునేమో?
ఎడారిలో పాలసముద్రాన్ని తోడవచ్చునేమో?
ఏమో?
చివరికి ని ప్రయత్నం తో సోషలిజం దొరికిన దొరకొచ్చునేమో?
ప్రజలకోసమే నిస్వార్థంగా పనిచేసే ప్రభుత్వాన్ని,
క్రమబద్దంగా నడుస్తున్న చట్టాల అమలుని,
లంచాలే అడగని పొలిసులను ,
అధికారులను  సమయానికి వచ్చే బస్సు,ట్రైన్లను ...
రిజర్వేషన్ కోటలు లేని ప్రతిభ ఆధారంగా
నిర్ణయించిన ప్రభుత్వ ఉద్యోగమే దొరకొచ్చునేమో?
వెతుకు ప్రపంచాన్ని గడగడా లాడిస్తున్న
ఈ ఆకలి భుతానికీ అమ్మను కనిపెట్టవచ్చునేమో! 

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget